
విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు
ముంచంగిపుట్టు: మండలంలోని జర్జుల పంచాయతీ బలడ గ్రామంలో ఇటీవల పిడుగుపాటుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పాడైంది. సమస్యను సర్పంచ్ పోర్తిమ్మ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ సురేష్, సిబ్బందితో గ్రామంలో యుద్ధప్రాతిపదికన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేశారు. దీనిపై స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ సురేష్ మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ సమస్యలుంటే తనకు తెలియజేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, లైన్‌మెన్‌లు సత్యబాబు, బాలన్న, వార్డు సభ్యులు గణేశ్వరరావు, రామారావు, ఊర్థోబ్, మురళి, కృష్ణ, లంబుధర్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.