
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: వై.రామవరం, అడ్డతీగల ప్రధాన రహదారిలో ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు, మరోపక్క సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు అడ్డతీగల సిఐ బి నరసింహమూర్తి ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అపరిచితులు, అనుమానస్పద వ్యక్తులపై నిఘా విధించారు. ట్రైనీ ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.