
పుట్టగొడుగుల పెంపకంతో గిరిజన యువతకు ఉపాధి
రంపచోడవరం: పుట్టగొడుగుల పెంపకంతో గిరిజన యువత, మహిళలు ఉపాధి పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని హిఫర్ ఇంటర్‌నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీతా తెలిపారు. మండలంలో ఉసిరిజొన్నల గ్రామంలో కుటీర పరిశ్రమగా పది సంవత్సరాలుగా పుట్టగొడుగుల పెంపకం నిర్వహిస్తున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో నవజీవన్ ఆర్గనైజేషన్, హిఫర్ ఆర్గనైజేష్‌న్ సహకారంతో 25 మంది రైతులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సునీతా మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం ప్రధానమని చెప్పారు. ఈ ప్రాంతానికి అనుకూలమైన రకాల ఎంపిక, డార్క్ రూమ్‌లో ఎన్ని రోజులు ఉంచాలి తదితర విషయాలను వివరించారు. శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ ఆర్గనైజేషన్‌ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాస్, బీడీవో ఎం.నాగేశ్వరరావు, డీఈవో రాంలాల్, సీఎఫ్‌లు చిన్నలుదొర, సాయివెంకట్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా సంధ్యా దేవి
బీచ్‌రోడ్డు(విశాఖ): ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యా దేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బుచ్చిరాజు ఉద్యోగ విరమణ పొందిన తరువాత ఆమె తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్‌గా కొసాగనున్నారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో ముగ్గురు ప్రొఫెసర్లను వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎండోక్రినాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యంను ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా.. గైనాకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సి.అమూల్యను శ్రీకాకుళం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా.. జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వి.మన్మధరావుకు మచిలిపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.