ఘనంగా రైతు దినోత్సవం
రైతులకు విత్తనాలు అందజేస్తున్న
కేవీకే కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్
రంపచోడవరం: పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెవీకె కోఆర్డినేటర్ , సీనియర్ శాస్త్రవేత్త డా. కె రాజేంద్రప్రసాద్ ఉపాధిహామీ పథకం విశిష్టతను వివరించారు. రైతులు ఈ కాలంలో కూరగాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విస్తరణ విభాగం శాస్త్రవేత్త డా. ఆర్ ప్రవీణ్‌బాబు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జి రాంజిగా మార్పు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 125 రోజులు పని దినాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వేతనాల చెల్లింపులో ఆలస్యంగా పరిహారం ఇస్తున్నారని తెలిపారు. పీహెచ్‌వో దేవదానం మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులకు నువ్వులు, మినుము విత్తనాలు అందజేశారు.


