ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు
పాడేరు రూరల్: జిల్లా కేంద్రం పాడేరులో ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వీటికి ఎస్‌జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి పాంగి సూరిబాబు ఆధ్వర్యంలో వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పురుషుల ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలను డీఈవో రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రోబాల్‌లో రంపచోడవరం డివిజన్, క్రికెట్‌లో పాడేరు డివిజన్ ప్రథమ స్థానం సాధించాయన్నారు. అనంతరం ఎస్‌జీఎఫ్ కార్యదర్శి పాంగి సూరిబాబు మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. పీడీలు సత్యవతి, కొండబాబు, భూపతిరాజు, చిన్ని, గంపరాయి, మహేష్‌బాబు పాల్గొన్నారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు


