గెలుపు ఓటములు సహజం
● డీఈవో రామకృష్ణారావు
పాడేరు రూరల్: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని డీఈవో రామకృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి ఉపాధ్యాయులకు నిర్వహించిన త్రోబాల్, క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో మహిళల త్రోబాల్ విభాగంలో రంపచోడవరం విన్నర్, పాడేరు డివిజన్ రన్నర్‌గా నిలిచారన్నారు. పురుషుల క్రికెట్ విభాగంలో విన్నర్‌గా పాడేరు డివిజన్, రన్నర్‌గా రంపచోడవరం డివిజన్ కై వసం చేసుకున్నాయన్నారు. ఎస్‌జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి పాంగి సూరిబాబు, సీడీలు సత్యవతి, కొండబాబు, భూపతిరాజు,మహేష్‌బాబు పాల్గొన్నారు.


