ప్రేమ, కరుణ, ఆనందం వెల్లివిరియాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: అరకులోయ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో ప్రేమ, కరుణ, శాంతి, ఐక్యత, విలువలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే కోరారు. ప్రేమ, త్యాగం, కరుణకు ప్రతీక క్రిస్మస్ వేడుక అన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధిని నింపాలని ఎమ్మెల్యే మత్స్యలింగం ఆకాంక్షించారు.


