ఆత్మవిశ్వాసం నింపింది | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసం నింపింది

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

నేను డిగ్రీ పూర్తి చేశా. ఆర్‌సెటీలో మగ్గం వర్క్‌లో శిక్షణ తీసుకున్నా. సొంతంగా వ్యా పారం ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ శిక్షణ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. – సోయం స్వప్న,

గౌట సాంగ్వీ, బోథ్‌, ఆదిలాబాద్‌

ఉపాధి మార్గం ఎంచుకోవచ్చు

నేను పదో తరగతి వరకు చదువుకున్నా. నాలాంటి యువతులు టైలరింగ్‌ నేర్చుకుని తమ గ్రామాల్లోనే స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు. మ హిళలు, యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఆత్రం సౌమ్య,

మాణిక్యాపూర్‌, తిర్యాణి, కుమురంభీం

ధైర్యం వచ్చింది

నేను పదో తరగతి వరకు చదువుకున్నా. ఆర్‌సెటీలో టైలరింగ్‌లో శిక్షణ పొందా. నాలాంటి గ్రామీణ యువతులకు ఆర్‌సెటీ ఉచితంగా అందిస్తున్న శిక్షణ ఎంతగానో మేలు చేస్తోంది. నా కాళ్లపై నేను నిలబడతాననే ధైర్యం వచ్చింది.

– సిడాం సంధ్య, లోహ, దహెగాం, కుమురంభీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement