నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 21 2026 1:26 AM | Updated on Sep 21 2026 1:26 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆదివా రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని అశోక్‌రోడ్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, వినాయక్‌చౌక్‌, మహాలక్ష్మివాడ, జైజవాన్‌ నగర్‌, క్రాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో నిమజ్జన రూట్‌ను పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. నిమజ్జన రూట్‌లోని మసీదుల వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రహదారులపై ఉన్న అడ్డంకుల ను గుర్తించి తొలగించాలని, ఊరేగింపునకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బందోబస్తు, ట్రాఫిక్‌ మళ్లింపు, రూట్‌ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించా రు. ఆయన వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐ, ట్రాఫిక్‌ సీఐలు సునీల్‌ కుమార్‌, నాగరాజు, వెంకటేశ్వర్లు, క్లస్టర్‌, సెక్టార్‌ ఇన్‌చార్జీలు, ఇతర అధికారులు ఉన్నారు.

22, 23 తేదీల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌: జిల్లాస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌, టేబు ల్‌ టెన్నీస్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఆడే రామేశ్వర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్జీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నె ల 22న 14 ఏళ్లలోపు బాలబాలికలకు, 23న 17 ఏళ్లలోపు బాలబాలికలకు ఇండోర్‌ స్టేడియంలో ష టిల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. 23న 14, 17 ఏళ్లలోపు బాలబాలికలకు లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌, శాంతినగర్‌లో టేబుల్‌ టెన్నీస్‌ ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9.30 గంటలకు ఆధార్‌కా ర్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement