కై లాస్‌నగర్: కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో నిరాదరణకు గురైన ఉత్తర తెలంగాణ జిల్లాలు సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మహర్దశ పట్టి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలు రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాను దత్తత తీసుకున్నామనే సీఎం ప్రకటనతో ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీ య ముఖచిత్రంలో స్పష్టమైన మార్పు వస్తుందన్నారు. ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 2,072 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. ఈ మేర కు భూసేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుందన్నారు. తాజాగా నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్‌కు అవసరమైన 2వేల భూ సేకరణ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఐటీ టవర్‌కు గత ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయిస్తే రేవంత్ సర్కారు మరో రూ.25 కోట్లు అదనంగా మంజూరు చేసిందన్నారు. ఫిట్‌లైన్ 2, 3 నెలల్లో పూర్తయితే మరో 20 నుంచి 30 రైళ్లు జిల్లాకు రానున్నాయన్నారు. ఇందులో నాయకులు అశోక్, మహేందర్ తదితరులున్నారు.


