ఆదిలాబాద్‌టౌన్: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు వందశాతం రిజ ర్వేషన్ కల్పించే జీవో 3ను పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశా రు. ఈమేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఆదివాసీ ఎమ్మెల్యేలతో తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా సమావేశంలో మా ట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీల కు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అసెంబ్లీలో ఆదివా సీల సమస్యలను ప్రస్తావించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. జీవో 3 పునరుద్ధరణకు తీర్మానంతో పాటు గవర్నర్, రాష్ట్రపతికి పంపి ఆర్డినెన్స్ ద్వారా పునరుద్ధరించాలన్నారు. అలా గే 1/70 చట్ట పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు సక్కు, గోవింద్, కిష్టన్న, జంగుబాయి పాల్గొన్నారు.


