సాత్నాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో సాత్నా ల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. పూర్తిస్థా యి మట్టానికి చేరువైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.24టీఎంసీ కాగా, ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు జేఈ దీపక్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని,ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని వెల్లడించా రు. మరోవైపు ఎగువన గల తోయగూడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇలాగే ప్రాజెక్టు నిండినా నీటి విడుదలలో జాప్యం కారణంగా సుమారు 300 ఎకరాల మేర పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.


