నిర్మల్‌రూరల్: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో విషాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలించేందుకు ఆదివారం ట్రాక్టర్‌లో ఎక్కిస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురై కాలనీకి చెందిన ఎంబడి శివకుమార్ (35) మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


