జన్నారం: గత విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన లసెట్టి శ్వేత నగదు పురస్కారం అందుకోనుంది. కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన బాలిక 582 మార్కులతో జిల్లాలో ప్రథమస్థా నం సాధించింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో ట్రిపుల్‌ఐటీ ప్రథమ సంవత్సరం చదువుతో ంది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చేపట్టిన ‘చదువుకో తెలంగాణ‘ కార్యక్రమంలో భా గంగా శ్వేతను ఎంపిక చేశారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా రూ.2 లక్షల నగదు పురస్కా రం అందుకోనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండా రాజన్న తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి ప్రతిష్టాత్మకమైన నగదు పురస్కారాని కి ఎంపిక కావడం పట్ల అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎంఈవో రాజేందర్, సర్పంచ్ వాసాల నరేష్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


