కాసిపేట: విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్లాలని మందమర్రి జీఎం రాధాకృష్ణ అన్నారు. మందమర్రి–సోమగూడం రహదారి పక్కన ఉన్న ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం కేఆర్ కుంగ్‌ఫూ అకాడమి, అమేచ్చుర్ ఆల్ స్టైల్ కుంగ్‌ఫూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6వ రాష్ట్ర స్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో 20 జిల్లాల నుంచి 600 లకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో గ్రాండ్ చాంపియన్‌షిప్ మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీగౌతమ్, బాలికల విభాగంలో గ్రాండ్ చాంపియన్‌షిప్ స్నిగ్దా కై వసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్ కుంగ్‌ఫూ అకాడమీ చైర్మన్ దాగం మల్లేశ్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, అమేచ్చుర్ ఆల్ స్టైల్ కుంగ్‌ఫూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్, అకాడమీ మాస్టర్ రవి, ఒలింపిక్ సెక్రెటరీ రమేశ్, మాస్టర్లు ప్రసాద్, వెంకటేష్, మహేష్, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.


