ఆదిలాబాద్‌రూరల్: కొలాం పీవీటీజీ గ్రామాల అభివృద్ధి నిధుల మళ్లింపుపై ఈనెల 21న కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు కొలాం సేవా సంఘం నా యకులు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో మట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ఆదివాసీ కొలాం పీవీటీజీ గిరిజనుల స మగ్ర అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, ఆ నిధులు కొలాం గూడేలకు చేరడం లేదన్నారు. ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీ పీవీటీజీ కొలాం గిరిజనులు, సంఘాల నాయకులు, యువకులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆదిమ గిరిజన కొలాం సే వా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోనేరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంరం రాజు, తదితరులు పాల్గొన్నారు.


