వర్ణమాల చెట్టు.. సులువుగా నేర్చుకునేట్టు.. | - | Sakshi
Sakshi News home page

వర్ణమాల చెట్టు.. సులువుగా నేర్చుకునేట్టు..

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

విమానంపై వినాయకుడు

సంప్రదాయ బోధనకు భిన్నంగా విద్యార్థులు సులువుగా నేర్చుకునేలా ఆదిలాబాద్‌ పట్టణంలోని బ్రహ్మన్‌వాడ ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు అనిల్‌ కుమార్‌ తయారు చేసిన తెలుగు వర్ణమాలతో కూడిన చెట్టు ఆలోచింపజేస్తోంది. విద్యార్థులను చెట్టు ముందర ఉంచి అందులోని పదాలను గుర్తించేందుకు వీలుగా చేసిన ఈ ప్రయోగం విద్యార్థుల స్వయం అభ్యాసనకు, అక్షర, పద గుర్తింపునకు తోడ్పడుతోంది. విరామం సమయంలో పిల్లలు అందరూ ఆడుతూ అక్షరాలను సులువుగా నేర్చుకుంటున్నారు. అట ఆడినట్లుగా చేపట్టే ఈ బోధనలో ఎవరు ఎక్కువ అక్షరాలు గుర్తిస్తారో వారు గెలిచినట్టుగా పేర్కొనడంతో విద్యార్థులు పోటీపడి మరి అక్షరాలు నేర్చుకుంటున్నారు.

– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్‌, ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా రూపొందించిన విమానం నమూనాపై గణేశ్‌ విగ్రహాన్ని ఉంచి బీజేపీ నాయకులు శోభాయాత్ర నిర్వహించారు. జిల్లాకు ఎయిర్‌పోర్టు మంజూరు కావడంపై ప్రధాని మోదీ, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.

– ఆదిలాబాద్‌/సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్‌, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement