వేధింపులపై ఆన్‌లైన్‌ ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వేధింపులపై ఆన్‌లైన్‌ ఫిర్యాదు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

బాలికలపై అనుచిత ప్రవర్తనకు డిజిటల్‌ కళ్లెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే కేసు పెట్టే అవకాశం ‘ఈ –బాల్‌నిధాన్‌’ ద్వారా నేరుగా కేంద్రానికి సమాచారం

నేరడిగొండ: బాలికలపై వేధింపులు, అనుచిత ప్రవర్తనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక బాధితులు ప్రతీ సందర్భంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. దీంతో ఫిర్యాదు చేయడానికి వెనుకాడే బాలికలకు ఈ విధానం అండగా నిలవనుంది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో బాలికలను వేధించే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులకు విషయం తెలియడం, పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందనే ఆందోళన, నిందితుల బెదిరింపులు తదితర కారణాలతో కొందరు ఫిర్యాదు చేయకుండా మౌనం వహిస్తున్నారు. దీంతో నిందితులు మరింతగా రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు

బాలికలు, పిల్లలపై జరిగే వేధింపులు, హింస, ఇతర అన్యాయాలపై ఠీఠీఠీ. ుఽఛిఞఛిట. జౌఠి. జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అందులోని ‘ఈ –బాల్‌నిధాన్‌’ విభాగాన్ని ఎంచుకుని సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి. ఘటనకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియో ఆధారాలు ఉంటే వాటిని కూడా అప్‌లోడ్‌చేసి ఫిర్యాదు సమర్పించవచ్చు.

కేంద్రం నుంచి జిల్లాస్థాయి వరకు పర్యవేక్షణ..

ఆన్‌లైన్‌లో నమోదైన ఫిర్యాదులను కేంద్ర స్థాయిలో ప్రత్యేక బృందం పరిశీలిస్తుంది. అనంతరం సంబంధిత రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు, అక్కడి నుంచి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం చేరుతుంది. బాలల సంరక్షణ అధికారులు స్పందించి విచారణ చేపడతారు. అవసరమైన సందర్భాల్లో పోలీసుల సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు.

బాధితుల వివరాలు గోప్యం..

ఫిర్యాదు చేసిన బాలిక, బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకుంటారు. దీంతో నిందితుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, బెదిరింపులకు భయపడకుండా బాధితులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కేసు పురోగతిని కూడా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement