పంట పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు | - | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

ఆదిలాబాద్‌రూరల్‌: ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పంట పొలాల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. మండలంలోని అల్లికోరి గ్రామపంచాయతీ పరిధిలో గల పొట్టంలొద్ది శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న మొక్కలను గురువారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో వివరాలు వెల్లడించారు. పొటంలొద్ది శివారులో గల వ్యవసాయ పొలాల్లో సాగు చేస్తున్నట్లు స మాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో 385 మొక్కలు స్వాధీనం చే సుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వాటి విలువ రూ. 38.50 లక్షలు ఉంటుందన్నారు. ఆ మొక్కలు గ్రా మానికి చెందిన మెస్రం గంగారాం పటేల్‌, మెస్రం నాగులకు చెందినవిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారు పరారీలో ఉన్నారని, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరిపై గతంలోనూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, రూరల్‌ సీఐ రహీం పాషా, ఎస్సై వి.విష్ణువర్ధన్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement