బేకరీ నిర్వాహకుడిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

బేకరీ నిర్వాహకుడిపై కేసు నమోదు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

● నిందితుడిని గుర్తించిన పోలీసులు ● ఆభరణాలు, నగదు స్వాధీనం

తానూరు: మండలంలోని బెల్‌తరోడా గ్రామంలో అధిక ధరలకు కూల్‌డ్రింక్స్‌, బేకరీ పదార్థాలు విక్రయిస్తున్న మిఠాయి భండార్‌, బేకరీ నిర్వాహకుడిపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. బెల్‌తరోడాలోని బేకరీలో పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారి పి.శంకర్‌ శుక్రవారం దుకాణాన్ని తనిఖీ చేశారు. పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

ముధోల్‌: మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు సుమారు 93వేల విలువైన బంగారు గొలుసు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. భూమేశ్‌ పాల కేంద్రంలోనూ రూ.2,500 నగదు చోరీ చేశారు. ఆ తర్వాత రాజు కిరాణాషాపులో చొరబడేందుకు యత్నించగా అలజడి కావడంతో పారిపోయాడు. బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇదే గ్రామానికి చెందిన గుమ్ముల సాయినాథ్‌ చోరీకి పాల్పడ్డట్లు గుర్తించారు. అతడి నుంచి బంగారు గొలుసు, వెండి ఆభరణలు, నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా, సాయినాథ్‌ నెల క్రితం చోరీ కేసులో జైలులోకి వెళ్లి రెండ్రోజుల కిందటే బయటకు వచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement