ఆదిలాబాద్‌రూరల్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కుమారుడు బాబాసాహెబ్ యశ్వంత్ రావ్ అంబేడ్కర్ స్మృతి దినోత్సవాన్ని భారతీ య బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌ తమబుద్ధుడు, సామ్రాట్ అశోక్, బాబా సాహెబ్ అంబేడ్కర్, రమాబాయి అంబేడ్కర్ చి త్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక బుద్ధ వందన ఆలపించారు. దేశ, విదేశాల్లో బౌద్ద ధమ్మప్రచారానికి యశ్వంత్ రావు విశేష కృషి చేశారని కొనియాడారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం ప్రచురించిన హమారప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్, ప్రధాన కార్యదర్శి గుల్షన్ బన్సోడె, కేంద్రీయ శిక్షక్ కాంతారావ్ వాఘ్మరే, ఆఫీస్ సెక్రటరీ కుమార్ సొన్‌కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.


