డీజేలకు అనుమతి లేదు | - | Sakshi
Sakshi News home page

డీజేలకు అనుమతి లేదు

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

● ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి

● ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేద ని ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి ఉందంటూ కొందరు వాట్సప్‌ గ్రూపుల్లో చేస్తున్న అసత్య ప్రచా రాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఆదిలాబాద్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగిస్తున్న డీజే యజమానులు, వాహన యజమానులపై ఇప్పటివరకు పది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డీజేలకు అనుమతి ఉందంటూ సోషల్‌ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై పోలీసుల నిఘా కొనసాగుతోందన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, గణపతి మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు. గణపతి నిమజ్జన కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement