ఉట్నూర్‌రూరల్: మండల పరిసర ప్రాంతాల్లో గత ఎనిమిది నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరితోపాటు వారికి సహకరించిన పలువురిని అరె స్టు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలి పారు. ఉట్నూర్ ఏఎస్పీ కార్యాలయంలో గురువా రం వివరాలు వెల్లడించారు. ఉట్నూరు ప్రాంతంలో మోనూ, షాజిద్‌లు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారు. ఇప్పటివరకు మూడు ఇళ్లలో రూ.30 వేల నగదుతోపాటు 3 తు లాల బంగారం, 47 తులాల వెండి ఆభరణా లను ఎత్తుకెళ్లారు. పంట పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగితీగలు, కాపర్ కాయిల్స్, సోలార్ బ్యాటరీ లు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసి విచారించడగా ఆరు చోట్ల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. చోరీ చేసిన విద్యుత్ సామగ్రిని షమ్షూ, మొబీన్, అతిక్ సహాయంతో స్థానిక స్కారప్ షాపులకు విక్రయించగా, బంగారు, వెండి ఆభరణాలను వ్యాపారులు ప్రభాకర్, చందన్, నారోజి విజయ్ కొనుగోలు చేశారు. వాటి అమ్మకాల్లో సహకరించిన మోహన్, జయవంత్, శివరాత్రి శ్రీనివాస్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సమావేశంలో సీఐ ప్రసాద్, ఎస్సై విజయ్ పాల్గొన్నారు.


