శ్రీరాంపూర్: కొత్త గనులతో సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గేయం, వందేమాతరం ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ తాడిచెర్ల 2 బ్లాక్, మణుగూరు డిప్ సైడ్ 2 బ్లాక్‌లను సాధించుకోవడం, బొగ్గు ఉత్పత్తి పెరగడంతోపాటు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం కృష్ణప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, సీఎంఓఏఐ ఏరియా ప్రతినిధి పద్మ, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎంలు అనిల్‌కుమార్, హరినారాయణ, ఏరియా సెక్యూరిటీ అధికారి హనుమాన్‌గౌడ్, డీవైపీఎం కాంత్రి పాల్గొన్నారు.


