మందమర్రిరూరల్: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిందని, జేబీసీసీఐ లోని సంఘాలకు సింగరేణిలో అవకాశం కల్పించా లని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసింట్ యాదగిరి సత్త య్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. 2025– 26 ఆర్దిక సంవత్సరం సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వా టా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, ప్రదీప్‌కుమార్, వీరన్న, దీక్షితులు పాల్గొన్నారు.


