రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ గురువారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, మౌలిక వసతులు, కల్పిస్తున్న సదుపాయాలను పరిశీ లించారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాల ని అధికారులకు సూచించారు. అనంతరం రామకృష్ణాపూర్‌లో నూతన ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలం కోసం సింగరేణి స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, తహసీల్దార్ సతీష్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సీఎంపీఎఫ్ క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషన ర్ భరత్‌కుమార్ తెలిపారు. గురువారం విజి లెన్సు అవగాహన కార్యక్రమాన్ని జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్, పీఎఫ్ క్లెయిమ్‌లు, అడ్వాన్స్‌లపై అవగాహన కల్పించారు. క్లెయిమ్‌లు జీరో పెండెన్సీ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం కృష్ణప్రసాద్, డీజీఎం(పర్సనల్)అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
రక్షణకు అధికప్రాధాన్యతనివ్వాలి
శ్రీరాంపూర్: రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని డీడీఎంఎస్(మెకానికల్) కౌశిక్‌సేన్ గుప్తా తెలిపారు. గురువారం సీసీసీలోని సింగరేణి గెస్టుహౌజ్ సమావేశ మందిరంలో లైఫ్, సేఫ్టీ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతీ ఉద్యోగి సేఫ్టీతో పని చేసేలా చూడాలని అన్నా రు. రక్షణ సూత్రాలు పాటించి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఏరియా ఎస్‌ఓటు జీఎం కృష్ణప్రసాద్, ఏరియా సేఫ్టీ అధికారి సత్యనారాయణ, ఓసీపీ పీఓలు వెంకటేశ్వర్లు, ఏవీ రెడ్డి, ఏజెంట్లు రవికుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.


