పెట్రోల్‌బంకులో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌బంకులో తప్పిన ప్రమాదం

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

● పెట్రోల్‌ తీయడానికి ప్రయత్నించిన యువకుడు ● పైప్‌ కనెక్టర్‌ కట్‌తో నేలపాలైన పెట్రోల్‌

బోథ్‌: మండలంలోని పొచ్చెర క్రాస్‌రోడ్డు సమీపంలో భారత్‌ పెట్రోల్‌ బంకులో బుధవారం అర్ధరాత్రి భారీ ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని యువకుడు బైక్‌తో బంకు వద్దకు వచ్చాడు. సిబ్బంది క్యాబిన్‌లో నిద్రిస్తుండగా, స్వయంగా డిస్పెన్సింగ్‌ నాజిల్‌తో బైక్‌లో పెట్రోల్‌ నింపుకొనేందుకు యత్నించాడు. పైపు కనెక్టర్‌ ఊడిపోవడంతో పెట్రోల్‌ బయటకు వచ్చి నేలపాలైంది. భయాందోళనకు గురైన యువకుడు అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. దాదాపు రూ.43,960 విలువైన 375.44 లీటర్ల పెట్రోల్‌ బంకు ఆవరణతో పాటు పక్కనే ఉన్న రోడ్డు, డ్రెయినేజీ వరకు ప్రవహించింది. సిబ్బంది వెంటనే మెషిన్‌ను నిలిపివేయడంతో ముప్పు తప్పింది. ఆ సమయంలో చిన్న నిప్పు రవ్వ చెలరేగిన బంకుతోపాటు పరిసర ప్రాంతాలు అగ్నికి ఆహుతై భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. నిర్వాహకులు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ దృష్టికి, బోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీఫుటేజీ ఆధారంగా యువకుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement