ముగ్గురి రిమాండ్.. పరారీలో ఒకరు 39 కిలోల కాపర్ వైరు, మొబైల్ ఫోన్, ఆటో స్వాధీనం వివరాలు వెల్లడించిన సీఐ మాదాసు రాజ్‌కుమార్
మల్యాల: కొద్ది నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న దొంగలముఠాను మల్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాజ్‌కుమార్, ఎస్సై ఎస్.సందీప్‌కుమార్ దొంగల ముఠా వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన తపాల బాబు, మంచిర్యాల వి కాస్‌నగర్‌కు చెందిన కోట శ్రీను, పల్లపు సురేశ్, సూ ర సురేశ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌వైరు దొంగిలిస్తున్నా రు. వైర్‌ను ముద్దగా చేసి.. విక్రయించి.. వచ్చిన డ బ్బును పంచుకునేవారు. మల్యాల, వెల్గటూర్, ధ ర్మపురి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో మొత్తం తొమ్మిది దొంగతనాలకు పాల్ప డ్డారు. గురువారం కొండగట్టు వద్ద కోట శ్రీను, పల్లపు సురేశ్, సూర సురేశ్ అనుమానాస్పదంగా తిరుతుగుతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి ప్యాసింజర్ ఆటో, మొబైల్ ఫోన్, ట్రాన్స్‌ఫార్మర్ పగులగొట్టే ప్రత్యేక పరికరం, 39 కిలోల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఏ–1 నిందితుడు తపాలా బాబు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు చేధించడంలో కృషి చేసిన ఎస్సై సందీప్‌కుమార్, కానిస్టేబుల్ రాజేందర్, ఆంజనేయులు, విక్రాంత్‌ను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.


