అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌/రెబ్బెన: చోరీలకు పాల్పడుతు న్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం వివరాలు వె ల్లడించారు. రెబ్బెన పోలీసుస్టేషన్‌ పరిధిలోని కై ర్‌ గాంలో ఈనెల7న ఇంటికి తాళం వేసి యజమాని తాండూర్‌లో వారి బంధువు అంతక్రియల కోసం వెళ్లారు. గమనించిన నిందితులు ముందుగా రెక్కీ నిర్వహించి, తాళం పగులగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ఛేదనకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి డీఎస్పీ అశోక్‌, రెబ్బెన సీఐ సంజయ్‌ ఆధ్వర్యంలో దర్యాపు చేపట్టాయి. గురువారం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన స్విఫ్ట్‌ డిజైర్‌ కారును తనిఖీ చేయగా, తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే సామగ్రితోపాటు బంగారం, వెండి లభించాయి. కారులో నలుగురిని అదుపులో తీసుకుని విచారించారు. తాండూర్‌, ఖైర్‌గావ్‌, జక్కులపల్లి, రెబ్బెన ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు అంగీకరించారు. పట్టుబడిన నిందితుల్లో మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని శివాజీనగర్‌కు చెందిన ఊపట్ల ప్రణయ్‌, శివాజీనగర్‌కు చెందిన రాజేశం, శాలిగామ కృష్ణ, శంబాజీనగర్‌కు చెందిన మంచెర్ల సతీశ్‌కుమారర్‌ ఉన్నారు. వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారు. వారి నుంచి 10.3 తులాల బంగారం, 30 తులాల వెండి, 4 సెల్‌ఫోన్లు, స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి, న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన డీఎస్పీ అశోక్‌, రెబ్బెన సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ, హెచ్‌సీ రవికుమార్‌, పీసీ నౌషద్‌, వెంకటేశ్‌ ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement