బోథ్: నవరాత్రుల పాటు నన్ను ధూపదీప నైవేద్యాలు, వేద మంత్రోచ్ఛరణ నడుమ అత్యంత నిష్ఠగా కొలుస్తున్నారు. అయితే గంగమ్మ ఒడికి సాగనంపే వేళ మాత్రం ఉదాసీనంగా ఉంటున్నారు. ప్రమాదాల బారిన పడి నాపై మచ్చ వచ్చేలా చూస్తున్నారు. ఈ సారి మాత్రం మద్యం జోలికి వెళ్లకండి. డీజే స్టెప్పులు కాకుండా.. మన సంస్కృతికి తగ్గట్టుగా సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భక్తి కీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా తరలివస్తే నేను మరింత సంతోషిస్తాను. మీ జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం ఇటీవల మీ దృష్టికి తెచ్చారని తెలిసింది. ఆలోచించండి. ఆచరిస్తారని ఆశిస్తున్నా. నా దీవెనలు ఎళ్లవేళలా మీపైనే ఉంటాయని హామీ ఇస్తున్నా.
– మీ గణనాథుడను


