ఆదిలాబాద్: రాష్ట్రంలోని చిన్న, వీధి వ్యాపారులు, దుకాణదారులు ఎలాంటి భయాందోళనలు లేకుండా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. శనివారం అసెంబీల్లో మాట్లాడుతూ, 65–70 ఏళ్ల క్రితం రూపొందించిన మున్సిపల్ నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాలని సూచించారు. చిన్నపాటి పొరపాట్లకు వెంటనే కేసులు నమోదు చేయకుండా, ముందుగా వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. అధికారుల తీరుతో కోర్టుల్లో కేసుల భారం పెరుగుతోందని పేర్కొన్నారు. చిన్న తప్పులకు పెద్ద శిక్షలు విధించకుండా పోలీసింగ్, వ్యాపార వ్యవస్థల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. పల్లెలు, పట్ట ణాల సమగ్ర అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన యువత స్వయం ఉపాధికి బ్యాంకులు ఆస్తుల హా మీ పేరుతో ఇబ్బందులు పెట్టకుండా రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.


