● జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు
ఆదిలాబాద్‌టౌన్: కోర్టుల్లోని పరిమిత వనరులతో కేసుల సత్వర పరిష్కారానికి వీలు పడదని, ఇరుపక్షాలు రాజీమార్గంలో వాటిని సత్వరం పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జడ్జి ప్రా రంభించారు. రాజీ మార్గంలో పరిష్కరించే అ వకాశమున్న పలు కేసులను పరిష్కరించారు. ఈ ఆయన మాట్లాడుతూ, కేసుల సత్వర పరి ష్కారంలో జిల్లా స్థానం గతంతో పోల్చితే మె రుగుపడిందన్నారు. సమష్టి భాగస్వామ్యంతో నే ఇది సాద్యమైందన్నారు. కార్యక్రమంలో డీఎ ల్‌ఎస్‌ఏ కార్యదర్శి హుస్సేన్ నాయక్, జడ్జీలు రాజ్యలక్ష్మి, తేజస్విని, చింత దివ్యారాణి, అదనపు ఎస్పీ సురేందర్ రావు, బార్ అసోసియేష న్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, ఉపాధ్యక్షుడు చందూసింగ్, ప్రభుత్వ న్యాయవాది దయాకర్, పీపీ రహిమ్, ిసీనియర్ న్యాయవాధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


