కై లాస్‌నగర్: వందశాతం సబ్సిడీపై అందించనున్న ఆటోమెటిక్ కుట్టు మిషన్లకు జిల్లాలోని బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 55 ఏళ్లలోపు ఉండి తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష 50వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు కలిగిన వారు నివాస ద్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్‌కార్డు, వృత్తి నైపుణ్యం సర్టిఫికెట్, కనీస విద్యార్హత పత్రాలతో tsobmms వెబ్‌పోర్టల్‌లో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో దరఖాస్తుల హార్డ్ కాపీలను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


