● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: పట్టణంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణ పనులను రానున్న రెండు నెలల్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలి పారు. జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద కొనసాగుతున్న పనులను రైల్వేశాఖ డిప్యూటీ సీఈ మల్లికార్జున్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి, గడువుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతోనే పనులు ఆలస్యమయ్యాయని తెలిపా రు. ప్రస్తుతం కేంద్ర నిధులు రూ.104.50 కోట్ల తో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైల్వే డిప్యూటీ సీఈ మాట్లాడుతూ మరో 10 నుంచి 20 రోజుల్లో ఆర్‌యూబీ లాంచింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వారం రోజులుగా పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో కౌన్సిలర్ గంట జీవన్, బీజేపీ నాయకులు జోగు రవి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.


