అడవి అందాలు చూస్తూ.. ఆహ్లాదం పొందుతూ | - | Sakshi
Sakshi News home page

అడవి అందాలు చూస్తూ.. ఆహ్లాదం పొందుతూ

Sep 13 2026 11:39 PM | Updated on Sep 13 2026 11:39 PM

● కవ్వాల్‌లో శిక్షణ రేంజ్‌ అధికారుల పర్యటన ● ‘సాక్షి’తో అభిప్రాయాలు వెల్లడి

జన్నారం: హైదరాబాద్‌లోని దూలపెల్లి అకాడమీకి చెందిన 57 మంది శిక్షణ రేంజ్‌ అధికారులు డిప్యూటీ డైరెక్టర్‌ మంజుల ఆధ్వర్యంలో ఆదివారం కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌లో పర్యటించారు. జన్నారం అటవీ డివిజన్‌లోని బైసన్‌కుంట, గొండుగూడ బేస్‌క్యాంపు, వాచ్‌టవర్‌, తదితర ప్రాంతాల్లో కాలినడకన కలియతిరిగారు. అడవి అందాలను చూస్తూ, ఆహ్లాదం పొందారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు డివిజన్‌లో తీసుకుంటున్న చర్యల గురించి ఎఫ్‌డీవో రామ్మోహన్‌ వారికి వివరించారు. అడవులు, గడ్డి క్షేత్రాల అభివృద్ధి, వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కుంటలు, గడ్డి మైదానాలు, ఆవాసాలు, కలప స్మగ్లింగ్‌ నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు వివరించారు. డాగ్‌స్క్వాడ్‌ వల్ల ఉపయోగం, స్మగ్లర్లను పట్టుకునే విధానం గురించి డాగ్‌స్క్వాడ్‌ బీట్‌ అధికారి అనిల్‌ వివరించారు. వారి వెంట రేంజ్‌ అధికారి ఖాదర్‌వలీ, సెక్షన్‌ అధికారులు మమత, శంకర్‌, బీట్‌ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని పలుకరించిన ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వెల్లడించారు. వారి మాటల్లోనే..

గేట్‌ నంబర్‌1 వద్ద శిక్షణ రేంజ్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement