ఇతర రాష్ట్రాల నుంచి..
ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారులను ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు దత్తత తీసుకుంటున్న మాదిరిగానే ఇతర జిల్లాలు, పరాయి రాష్ట్రాలకు చెందిన బాలబాలికలను మన ఉమ్మడి జిల్లా దంపతులు దత్తత తీసుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000 నుంచి 2026 ఆగస్టు నెలాఖరు వరకు 42 మంది చిన్నారులను దత్తత తెచ్చుకున్నారు.
అందరూ వంచితులే..
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత పిల్లలు ఏదో రకంగా వంచితులు అవుతున్నారు. కారణమేదైనా కొందరు శిశువులు పసిప్రాయంలోనే అనాథలుగా మారుతున్నారు. ఆడపిల్లలు అనే వివక్షతో వదిలి వెళ్తుండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పోషణ భారం తదితర అంశాలతో శిశుగృహకు చేరుతున్నారు.
అమెరికా.. ఇతర రాష్ట్రాల్లో ..
బెల్లంపల్లి: అనాథగా మిగిలిపోయిన చిన్నారులకు అమ్మానాన్నల ప్రేమ లభిస్తోంది. అర్హులైన దంపతులకు పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం ద్వారా వారికీ ఓ కుటుంబం ఏర్పడుతోంది. అనాథ పిల్లలను కుటుంబం చెంతకు చేర్చడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. దత్తత పొందిన దంపతులు చిన్నారులను అక్కున చేర్చుకుని మమతానురాగాలు పంచుతున్నారు. పేగుబంధాని కన్నా మిన్నగా అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. దత్తత ద్వారా చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగు పెడుతుండడం వారికి ఆనందాన్ని పంచుతోంది.
స్వరాష్ట్రం తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ చిన్నారులు దత్తత వెళ్లారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జార్ఘండ్ రాష్ట్రా ల దంపతులు చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఇద్దరు బాలికలను అమెరికా దేశీయులకు దత్తత ఇ చ్చారు. రెండేళ్లలోపు చిన్నారులను దత్తత తీసుకోవడానికి దంపతులు ఇష్టపడుతున్నారు. దత్తత విషయంలో బాలబాలికలనే లింగ వివక్షకు దంపతులు చూపించడం లేదని శిశుగృహ నిర్వాహకులు చెబు తున్నారు. ఏక సంతానం అమ్మాయి కలిగిన దంపతులు అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ముందు కు వస్తుండగా, అబ్బాయి ఉన్న దంపతులు అ మ్మా యి కావాలని కోరుతున్నారు. సంతానానికి నో చుకోని దంపతులు ఎవరైనా పరవాలేదని దత్తతకు ముందుకు వస్తున్నారు. దివ్యాంగులైన చిన్నారుల ను దత్తత తీసుకోకపోవడంతో మిగిలిపో తునారు.


