సారంగపూర్: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆదివారం అటవీ ప్రాంతంలో లేగదూడ కళేబరం కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండురోజుల క్రితం సిర్పెల్లి గ్రామ శివారులోని అడవిలోకి మేతకు వెళ్లిన ఆవులమందలోంచి ఒక లేగదూడ కనిపించకపోవడంతో స్థానికులు గాలింపు మొదలు పెట్టారు. రెండురోజుల తర్వాత కళేబరం కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌ఓ రామక్రిష్ణారావు, డీఆర్‌వో నజీర్‌ఖాన్ లేగదూడ కళేబరం లభ్యమైన ప్రాంతంలో సీసీకెమెరాలను అమర్చి చిరుతపులి హతమార్చినట్లు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు హర్షవర్ధన్, సంధ్యారెడ్డి, సంతోష్, సుజాత, వెన్నెల, తదితరులు ఉన్నారు.


