అనుమతి సరే.. పరిహారమేది? | - | Sakshi
Sakshi News home page

అనుమతి సరే.. పరిహారమేది?

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

రేణుకా సిమెంట్‌ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతులు

అటవీ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌

త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం

నిర్వాసితులకు ఇంకా అందని పరిహారం

సాత్నాల: జిల్లాలో పారిశ్రామిక రంగంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న రేణుకా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏ ర్పాటుకు కీలక ముందడుగు పడింది. అయితే పరి హార పంపిణీ అంశం మాత్రం ఇంకా పూర్తి కావడం లేదు. మండలంలోని రామాయి గ్రామ పరిధిలో ప్రతిపాదించిన ఈ పరిశ్రమకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉన్న ప్రధానఅడ్డంకుల్లో ఒకటి తొలగినట్లయింది. రామా యి–రాంపూర్‌ ప్రాంతంలో ప్రతిపాదించిన ఈ ప్రా జెక్టులో సిమెంట్‌ తయారీతో పాటు క్లింకర్‌ ఉత్పత్తి, అనుబంధ విద్యుత్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధిత శాఖ నుంచి తాజాగా అనుమతి లభించింది.

2 ఎంఎంటీపీఏ ఉత్పత్తి లక్ష్యం..

ప్రాజెక్టులో సుమారు 2 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌, 1.20 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. అలాగే విద్యుత్‌ అవసరాల కోసం 36మెగావాట్ల సామర్థ్యంతో క్యాప్టివ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, వ్యర్థఉష్ణం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి వంటివి ప్రాజెక్టులో కీలకాంశాలు. మరోవైపు ఫ్యాక్టరీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

పూర్తిస్థాయిలో అందని పరిహారం

ఫ్యాక్టరీ నిర్మాణం జరగనున్న ప్రదేశంలో భూములు కోల్పోతున్న 35 మంది రైతులకు ఇంకా పరిహారం అందలేదు. దాదాపు 110 ఎకరాలకు సంబంధించి పరిహారం అందాల్సి ఉంది. సంస్థ ఆధ్వర్యంలో సేకరించిన భూమిలో ప్రస్తుతం ఫెన్సింగ్‌ ప్రక్రియ షురూ చేయడంతో ఆ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement