భూములు తీసుకునే సమయంలో పరిహారం అందుతుందని అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చా రు. నెలలు గడుస్తున్నా ఇంకా అందలేదు. వ్యవసాయం చేసుకునే అవకాశం లేక, ఇటు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం, కంపెనీ ప్రత్యేక దృష్టి సారించి మా సమస్యను త్వరగా పరిష్కరించాలి.
– ఠాక్రే ప్రకాశ్, నిర్వాసితుడు
పరిహారం అందలేదు..
ఫ్యాక్టరీ కోసం మా భూములు తీసుకుని 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం అందలేదు. భూమినే నమ్ముకుని జీవిస్తున్న మా కుటుంబాలకు డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.


