సందేశాత్మక స్వరూపం
మహావినాయకుడికి తుది మెరుగులు దిద్దుతూ..
విశాల శిరస్సు
ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలిపే ది వారి ఉన్నత ఆ లోచనలే. పెద్ద తల విశా ల దృక్పథానికి ప్రతీక. ఉన్నతమైన ఆలోచనలు, మంచి సంకల్పాలతో ముందుకు సాగాలని వినాయకుడి తల మనకు సందేశమిస్తోంది.
పెద్ద చెవులు
మాట్లాడటం కంటే వినడమే గొప్ప గుణం. ఎదుటివారి మాటలను శ్రద్ధగా ఆలకించి, అందులోని మంచిని గ్రహించాలి. వినే గుణంతో జ్ఞానం, వివేకం పెంపొందుతాయని వినాయకుడి పెద్ద చెవులు చాటుతాయి.
అభయహస్తం
ధైర్యంగా ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకో వాలని వినాయకుడి అభయహస్తం సూచిస్తుంది. భక్తులను దీవిస్తూ ‘నేనున్నాను’ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని అభయమిస్తుంది.
పెద్దఉదరం
వినాయకుడి పెద్ద పొట్ట మనిషి జీవితంలోని పాపపుణ్యాలను సమానంగా స్వీకరించి, వాటి ఫలితాలను ఓర్పుతో భరించాలనే తత్వాన్ని తెలుపుతుంది. మంచి చెడులను జీర్ణించుకునే మనస్తత్వంతోపాటు, ఆరోగ్యానికి సంబంధించిన జీవన సూత్రాన్ని సూచిస్తుంది.
ఏకదంతం..
విఘ్నేశ్వరుడి ఏక దంతం త్యాగం, పట్టుదల, మంచి–చెడుల మధ్య వివేచనకు ప్రతీకగా భావిస్తారు. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతీ విషయాన్ని పూర్తిగా స్వీకరించాల్సిన అవసరం లేదని చెబుతుంది. అవసరమైనప్పుడు స్వార్థాన్ని పక్కనపెట్టి సమాజ శ్రేయస్సు కోసం త్యాగం చేయాలనే గొప్ప సందేశాన్నిస్తుంది.
చిన్న నోరు
ఎక్కువగా వినాలి.. తక్కువగా మాట్లాడాలి.. ఇదే గణనాథుడి చిన్న నోరు చెప్పే నీతి. ఆలోచించకుండా పలికే మాటలు అనర్థాలకు దారితీస్తాయి. అందుకే ప్రతీ మాటను ఆలోచించి, ఆచితూచి మాట్లాడాలని వినాయకుడి రూపం సందేశమిస్తుంది.
తొండం..
తొండం బలానికి, సున్నితత్వానికి ప్రతీక. పెద్ద వృక్షాలను సైతం పెకిలించే, చిన్న సూదిని కూడా అందుకునే నైపుణ్యం ఉంటుంది. మనిషి జీవితంలో ఎ దురయ్యే కఠిన పరిస్థితులను ధైర్యంగా అధిగమించడంతోపాటు, చిన్న విషయాలను సైతం సూక్ష్మంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునే వివేకం అవసరమని ఇది సూచిస్తుంది.
మోదకం..
గణపతి చేతిలోని మోదకం జ్ఞానం, సాధన, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. ఇది బయటకు సాధారణంగా కనిపించినా లోపల తీపిని కలి గి ఉంటుంది. అలాగే నిజమైన ఆనందం బయట ఉన్న సంపదల్లో కాకుండా జ్ఞానం, సత్కర్మ, మంచి ఆలోచనల్లో ఉంటుందని ఇది సూచిస్తుంది.
చిన్న కళ్లు..
విఘ్నేశ్వరుడి చిన్న కళ్లు ఏకాగ్రత, పరిశీలన, లక్ష్యంపై దృష్టికి ప్రతీకగా చెబుతారు. మనిషి జీవితంలో ఎన్నో ఆకర్షణలు, ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని మరచిపోకూడదనే సందేశం ఇందులో ఉంది. మనసును చెల్లాచెదురు కాకుండా ఒకే లక్ష్యంపై కేంద్రీకరిస్తే విజయాన్ని సాధించవచ్చని వినాయకుని నయనాలు సూచిస్తాయి.
బీపీ.. షుగర్
ప్రారంభ దశలో గుర్తించడంతో..
ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏఎన్‌ఎంల ద్వారా 30 ఏళ్ల వయస్సు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్, మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో 73.86 శాతం స్క్రీనింగ్ పూర్తయ్యింది. మరో నెల రోజుల్లో వంద శాతం పూర్తి అవుతుంది. వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స నిర్వహించి మందులు అందిస్తున్నాం. జంక్‌ఫుడ్, జీవనశైలి మార్పుతోనే ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. 30 ఏళ్లు పైబడిన వారు అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ సాధన, డీఎంహెచ్‌వో
ఆదిలాబాద్: గజాననుడి జన్మవృత్తాంతం మొదలు గణాధిపతిగా ఎదగడం వరకూ ప్రతీ ఘట్టం ప్రత్యేకమే. ఆయన రూపంలోని ప్రతీ అవయవం ఓ విశేషమే. విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి తన రూపంలోనే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను సూచిస్తాడు. ప్రతి భాగంలోనూ ఓ సందేశం దాగి ఉంటుంది. చవితి పర్వదినం పురస్కరించుకొని వినాయకుడి రూపంలోని విశిష్టతలు, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం.
రైతుల వివరాలు సేకరించాం
పరిహారం అందని రైతుల వివరాలు సేకరించాం. ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడి త్వరలోనే అందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూస్తాం.
– జగదీశ్వర్‌రావు, ఆర్డీవో, ఆదిలాబాద్


