ఆదిలాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగా యి. స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లా అమెచ్యూర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పో టీల్లో బాల, బాలికలు పాల్గొని సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, పీడీలు సాయి కుమార్, నాందేవ్ పాల్గొన్నారు.


