ఆదిలాబాద్‌రూరల్: ెపండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మావల పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులతో పాటు పరిసరాలను పరిశీలించారు. రా త్రి వేళల్లో పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరా లకు అడ్డుకట్ట వేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్, సాయిలు ఉన్నారు.
కాళోజీ సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ భాష, సంస్కృతి, ప్ర జా చైతన్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అన్నారు. కాళోజీ జయంతి వేడుకలను జిల్లా పోలీ సు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, కాళోజీ తన కలంతో ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, డీఎస్పీ ఇంద్రవర్ధన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మోహన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి, పోలీ సు కార్యాలయ ఏవో శివకుమార్ పాల్గొన్నారు.
పదోన్నతితో మరింత బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌కాని స్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. బుధవారం పోలీ సు కార్యాలయంలో వారికి పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ప్రమోషన్ పొందిన వారిలో వన్‌టౌన్ కానిస్టేబుల్ మహేందర్, గుడిహత్నూర్‌కు చెందిన ఎం.దేవిదాస్ ఉన్నా రు. వీరిని నిర్మల్ జిల్లాకు కేటాయించారు. అలాగే నేరడిగొండకు చెందిన కె.రమేశ్, తలమడుగుకు చెందిన ఎంఏ కరీమ్‌ను జగిత్యాల జిల్లాకు బదిలీ చేశారు.


