నిరుద్యోగులపై అక్రమ కేసులా! | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులపై అక్రమ కేసులా!

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

కాకినాడ రూరల్‌: ఉద్యోగాల కోసం కాకినాడలో శాంతియుతంగా ధర్నా చేసిన నిరుద్యోగులపై పోలీసు నిర్బంధాన్ని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమేమిటని, వాటిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం నిరసన తెలిపితే, వారికి నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్న 20 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులతో వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్న శ్యామ్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు జి.శ్యామ్‌పై కేసు పెట్టడం సరి కాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నాగమణి డిమాండ్‌ చేశారు.

స్విమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స

తిరుపతి తుడా: తిరుపతిలోని స్విమ్స్‌ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యాన ఓ పేద రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాలివీ.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలానికి చెందిన బి.వెంకట సూరిబాబు (50) మూడు నెలలుగా గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. పలు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో, అతడు స్విమ్స్‌ ఆసుపత్రిని సంప్రదించారు. సూరిబాబును వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షించి ప్రాణదానం పథకం కింద ఎంపిక చేసి, సీఆర్‌టీ–డీ పరికరం అమర్చారు. లక్షల రూపాయల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా విజయవంతంగా చేశారు. టీటీడీ, స్విమ్స్‌ అధికారులకు, వైద్యులకు రోగితో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన

బాస్కెట్‌బాల్‌ శిక్షణ

రామచంద్రపురం రూరల్‌: జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ బాలికల జట్టు ఉచిత శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి ఈ విషయం తెలిపారు. బాలుర జట్టుకు ఈ నెల 11 వరకూ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, బాస్కెట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఽఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపారు.

బీసీల పాలిట తెగులు టీడీపీ

రాజమహేంద్రవరం రూరల్‌: తెలుగుదేశం పార్టీ బీసీలను ఎదగకుండా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటనలో తెలుగు బీసీలు అన్నారు కానీ నిజానికి బీసీల పాలిట తెగులుగా టీడీపీ తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలను కులవృత్తులుగా పనిముట్లుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో వారిని విద్యకు దూరం చేశారని ఆరోపించారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెడితే బీసీ విద్యార్థులు చదువుకుని ఐటి రంగంలో ఎదిగారని ఆయన అన్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి 34 శాతం రిజర్వేషన్‌ను మించి 40 శాతం వరకు వారికి పదవులు కల్పించేలా చర్యలు చేపట్టి స్థాని క ఎన్నికలకు వెళ్లారని వేణు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 45 శాతం కూడా వారికి ప్రయోజనం కలిగిందని, అయితే దానిని 24 శాతానికి జగన్‌ తగ్గించేసినట్లు నాడు టీడీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. మరి ఇప్పుడెలా 34 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని 105 జీవో ఇచ్చారని వేణు ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పు అధిగమించి హామీ ఇచ్చేసి, ప్రజలను మోసగిస్తారా అని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటె 52 శాతం ఉన్న బీసీలకు 34 శాతం కాకుండా కనీసం 40 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీసీలను కులవృత్తులకు పరిమితం చేయడానికి రూ.వెయ్యి కోట్లు మొదటి బడ్జెట్‌లో పెట్టి, కనీసం రూ.వెయ్యి ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. రెండో బడ్జెట్లోనూ అలాగే పెట్టి రూ.2 వేలు కూడా ఇవ్వలేదన్నారు. మూడో బడ్జెట్‌లోనూ అలాగే పెట్టి సగం కాలమైనా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు ఉన్న బీసీల కు పెన్షన్లు ఏమయ్యాయని వేణు ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వరరావు, కొండపల్లి దుర్గారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement