కై లాస్‌నగర్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ ఆదేశించారు. బుధవా రం ఆమె హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా ల్లోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించాలన్నారు. పర్యాటక ప్రాంతా ల్లో తాగునీరు, ఆహార పదార్థాలు, ముఖ్య పట్ట ణాల నుంచి రవాణా సౌకర్యం, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, భద్రత, పార్కింగ్, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. సినీ చిత్రీకరణకు అనుకూలమైన ప్రాంతాలు గుర్తించి, అభివృద్ధి పర్చాలన్నారు. రానున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా లని, ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్.చిత్రు, ఎస్. రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి పాల్గొన్నారు.


