మంచిర్యాలఅర్బన్: వినాయక చవితి పర్వదినానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే మండపాల ఏర్పాటు, భారీ గణపతి విగ్రహాల తరలింపు పనులు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, కోరుట్ల నుంచి భారీ విగ్రహాల తరలింపు కొనసాగుతోంది.
విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు
భారీ విగ్రహాల తరలింపులో దారిలో విద్యుత్ వైర్లు, ఫ్లైఓవర్లు, అడ్డంకులు లేకుండా ముందే రూట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రధాన రహదారులపై రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో, తెల్లవారుజామున విగ్రహాలను తరలించాలి. వాహనానికి ముందు, వెనుక హెచ్చరిక బోర్డులు, రెడ్ లైట్లు అమర్చాలి. విద్యుత్ వైర్లు అడ్డంగా ఉన్న చోట విద్యుత్‌శాఖ సిబ్బందిని వెంట ఉంచుకోవటం సురక్షితం. దారిలో వర్షం కురిస్తే రంగులు వెలిసిపోకుండా వాటర్‌ప్రూప్ కవర్లతో విగ్రహాన్ని కప్పి ఉంచాలి. దారిలో విద్యుత్ తీగలు తాకకుండా చూసుకోవాలి. వాహనానికి వెనుకభాగంలో కూర్చోవడం అత్యంత ప్రమాదకరం.


