కాసిపేట: ఢిల్లీలోని బాలభవన్‌లో జరిగిన ఉల్లాస ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర స్టాల్ ఆకర్షణీయంగా నిలిచింది. స్టాల్‌లో తెలంగాణ రాష్ట్రం వాచకాలను టీఎల్‌ఎంను ప్రదర్శించినట్లు డీఆర్‌పీ బండ శాంకారి తెలిపారు. బుధవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బోనాలు, అక్షర బతుకమ్మ, బంజార నృత్యం ప్రదర్శించినట్లు తెలిపారు. వేదికపై భువనమ్మ కొండల్లో కోయిలపాటలు పాడా లి అనే అక్షరజ్ఞానం పాటలు పాడి అందరి మనన్నలు పొందినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో అధికారులు పురుషోత్తంనాయక్, మహ్మద్ నుమాన్, రంగారెడ్డి డెప్యూటీ డైరెక్టర్ అనిత, రాష్ట్ర కోఆర్డినేటర్ శైలజ , వాలంటీర్లు రాజేశ్వరి, రజిత, కవిత, పాల్గొన్నారు.


