బెల్లంపల్లి: అటవీశాఖ అధికారులు బుధవా రం అడవిపంది మాంసం పట్టుకున్నట్లు బెల్ల ంపల్లి రేంజ్ అధికారి సీహెచ్ పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేర కు రేంజ్ పరిధిలోని ధర్మారావుపేట బీట్‌లో బుగ్గగూడ సమీపంలోని పత్తి చేనులో గాలింపు చర్యలు చేపట్టగా సంకుర్తల శ్రీకాంత్ ప ట్టుబడ్డాడు. అతన్ని విచారించగా అడవిపందిని వేటాడి చంపినట్లు అంగీకరించాడు. అతనితో పాటు మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన శ్రీనివాస్, రంజిత్‌పై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు.
రైల్వే బ్రిడ్జిపై వ్యక్తి
మృతదేహం
బాసర : బాసర గోదావరి నది మొదటి రైల్వే బ్రిడ్జిపై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి (58) మృతి చెందినట్లు రైల్వే ఏఎస్‌ఐ మహబూబ్ ఖాన్ తెలిపారు. మృతుడు నీలిరంగు లుంగీ, సిల్వర్ రంగు టీషర్టు ధరించి ఉన్నాడని, చేతిపై ‘కే. లక్ష్మి’ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన వ్యక్తి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలోని కేళాపూర్‌కు చెందిన నంది దగాడే ద్విచక్ర వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్‌తో బుధవారం పట్టణంలో తిరుగుతుండగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నంబర్ ఉండగా, ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నంబర్‌ప్లేట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
అడవి పందుల బీభత్సం
సిరికొండ: మండలంలోని కొండాపూర్ శివారులో మంగళవారం రాత్రి రైతు సాయిని రాయమల్లు మూడెకరాల మొక్కజొన్న చేనుపై అడవిపందులు దాడిచేసి ధ్వంసం చేశాయి. చేతికి అందివచ్చి న పంటలపై అడవి పందులు దాడులు చేస్తుండడంతో రైతులు రాత్రివేళ కాపలాగా వెళ్తున్నారు.


