మంచిర్యాలక్రైం: చదువుకొమ్మన్ని మందలించినందుకు బా లు డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు ఎక్బల్‌హైమద్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్–నూరి దంపతులకు ట్విన్స్ కుమారులు ఎండీ అమేర్, ఎండీ అమీర్(17). అమేర్ లారీ మీద పనికి వెళ్తుంటాడు. ఇంటర్ చదువుతున్న అమీర్ చదువు మానే సి అన్నతోనే వెళ్తానని కాలేజీకి డుమ్మా కొట్టేవాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 6న ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ స భ్యులు స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్తితి విషమించి బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
తాండూర్: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మి కుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌రావు తెలి పారు. గోలేటీ సీహెచ్‌పీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న బోయపల్లికి చెందిన మేకార్తి రాజేశం (32) రోజువారీ విధుల్లో భాగంగా బుధవారం స్కూటీపై గోలేటికి వెళ్తుండగా బెల్లంపల్లి నుంచి గోలేటి వైపు వెళ్తున్న ఎర్టిగా వేగంగా స్కూటీని ఢీకొ ని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటనలో రాజేశం తలకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా బెల్లంపల్లి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


