కుప్టి బ్రిడ్జికి మరమ్మతులు షురూ | - | Sakshi
Sakshi News home page

కుప్టి బ్రిడ్జికి మరమ్మతులు షురూ

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

ఇచ్చోడ: ‘కుప్టి పాతబ్రిడ్జికి బుంగ’ శీర్షికన ఈనెల 8న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎట్టకేలకు బుధవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చిన 12 మంది సభ్యులు బ్రిడ్జి పై బుంగ పడిన ప్రదేశంలో మరమ్మతు చేస్తున్నారు. బ్రిడ్జికి ఉన్న 13 జాయింట్‌ల వద్ద పాత స్టీల్‌ రాడ్‌లు, కంకరను తొలగించి వాటిస్థానంలో కొత్త రాడ్‌లు బిగించి సిమెంట్‌, కంకరతో జాయింట్లను పూ డ్చాల్సి ఉంటుందని కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. దాదాపుగా నెల రోజులపాటు పనులు కొనసాగనున్నట్లు ‘సాక్షి’కి వివరించారు. కుప్టి పాత బ్రిడ్జిని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు నిర్మించారు. నేషనల్‌ హైవే అఽథారిటీ అధికారు లే మరమ్మతులు చేపట్టాలి. కానీ వారు పనులు ప్రా రంభించకుండా నిర్లక్ష్యం చేశారు. చివరి సమయంలో చేతులెత్తేసి మరమ్మతు పనులను కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement