కై లాస్‌నగర్: పట్టణంలోని మహాలక్ష్మివాడ, జైజవాన్‌నగర్, చిల్కూరిలక్ష్మినగర్, తాటిగూడ కాలనీవాసులకు నీటి సరఫరాలో తరచూ ఎదురవుతున్న ఇబ్బందులపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్‌సీసీ 400ఎంఎం డయా పంపింగ్ పైపులైన్ పాతది కావడంతో తరచూ సమస్యలు తలెత్తి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పాత పైపులైన్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న ప నులను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూ ష సోమవారం పరిశీలించారు. పనుల ప్రగతి పై ఆరాతీశారు. త్వరితగతిన పూర్తయ్యేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. రాబో యే వేసవి దృష్ట్యా నీటిసరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం నూతన పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా పే ర్కొన్నారు. ఈక్రమంలో మరో వారం వరకు నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పవని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట వార్డు కౌన్సిలర్ సంజయ్, పబ్లిక్ హెల్త్ అధికారులు అర్షద్, అమృత్ తదితరులున్నారు.


